Saturday, May 19, 2018

Actress Hariteja Emotional video on Insulted in Mahanati || హరితేజ || TA...



కొద్దిరోజుల
క్రితం హరితేజ తన కుటుంబ సభ్యులతో కలిసి
మహానటిమూవీకి వెళ్లిందట. అయితే ఆమూవీ ఇంటర్వెల్
లో తన తల్లి కోరడంతో ఆమె పక్క సీట్లోకి వెళ్ళి అప్పటి వరకు తన తల్లి పక్కన
కూర్చున్న తన తండ్రిని తన సీట్లోకి పంపిందట. అయితే ఈ కుటుంబ సభ్యుల సీట్ల పక్కన
కూర్చున్న ఒక తల్లీ కూతుళ్ళు ఇలా ఎందుకు సీట్లు మారుతున్నారు అని ప్రశ్నించడమే
కాకుండా తన కుమార్తె పక్కన హరితేజ తండ్రి కూర్చుంటే ఆమెకు ఇబ్బందిగా ఉంటుంది అని
ఆమె చెప్పిందట.
 ఈమాటలకు షాక్ అయిన హరితేజ తండ్రి లాంటి వయస్సు ఉన్న వ్యక్తి పక్కన
కూర్చోవడంలో ఏమిటి సమస్య అని ప్రశ్నించిందట. దీనికి ఆతల్లి కూతుళ్ళు సినిమా
వాళ్లకు వావి వరసలు ఉండవు కాబట్టి ఎవరి పక్కనైనా కూర్చుంటారని తాము అలా చేయలేము
అని ఘాటైన సమాధానం ఆతల్లి కూతుళ్ళు ఇచ్చారట.
 దీనితో రెచ్చిపోయిన హరితేజ ఆతల్లి
కూతుళ్ళను అనేక మాటలనడం దానికి సమాధానంగా వారు ఘాటైన సమాధానాలు ఇవ్వడంతో గొడవ
పెరిగిన నేపధ్యంలో ఆధియేటర్ కు సంబంధించిన వ్యక్తులు సద్దుబాటు చేయడంతో ఆగోడవ
ముగిసిందని హరితేజ చెపుతోంది. ఈవ్యవహారం అందరికీ తెలియాలని తన వేదనను వ్యక్త
పరుస్తూ హరితేజ ఒక వీడియో కూడ సోషల్ మీడియాలో పెట్టింది. అంతేకాదు సినిమావాళ్ళను
అగౌరవంగా చూసే సంస్కృతి పెరిగిపోయిందని అంటూ కోట్లమందికి వినోదాన్ని ఇచ్చే సినిమా
తారలను టార్గెట్ చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది అంటూ హరితేజ తన వ్యధను వ్యక్త
పరిచింది..


No comments:

Post a Comment