Thursday, May 17, 2018

Mahira hot walk with Aishwarya,Sonu kapur on Cannes red carpet || Canne...



కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్
కార్పెట్ ఈసారి కొత్త తళుకులతో కళకళలాడింది. కేన్స్ కు అన్ని దేశాల నుంచి
అందగత్తెలు వచ్చి తమ అందచందాలతో ఆకట్టుకుంటుంటారు. గ్లామర్ అండ్ ఫ్యాషన్ ను
కలబోసేలా ఉండే డ్రస్సులతో హీరోయిన్లు ముస్తాబయి వస్తారు. కేన్స్ లో మేజర్ అట్రాక్షన్
ఇదే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మన దేశం నుంచి ఈ ఏడాది ఐశ్వర్య రాయ్ - కంగన
రనౌత్ - సోనమ్ కపూర్ లు రెడ్ కార్పెట్ పై నడిచి తమ అందాలతో కనువిందు చేశారు.
 



ఈ ఏడాది పాకిస్తాన్ నుంచి కూడా ఓ హీరోయిన్ రెడ్ కార్పెట్ పై
మెరిసింది. ఆమె మనకు తెలిసిన నటే. షారుక్ ఖాన్ హీరోగా నటించిన రయీస్ సినిమాతో
బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మహీరాఖాన్ మొదటిసారి కేన్స్ లోకి అడుగుపెట్టింది.
బ్లాక్ కలర్ డిజైనర్ డ్రస్ లో వయ్యారంగా నడుస్తూ రెడ్ కార్పెట్ కు కళ
తీసుకొచ్చింది. తన గ్లామర్ అండ్ గ్రేస్ తో మహిరా అందరి దృష్టిని అట్రాక్ట్
చేసింది. 




గ్లామర్ ప్రధానంగా ఉండే కేన్స్ కు రావడానికి ఇంతవరకు పాకిస్తాన్
హీరోయిన్లు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇక్కడ గ్లామర్ ఏ కాస్త శృతిమించినా తిరిగి
పాక్ కు వెళ్లాక అక్కడ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహీరా ఖాన్ దీనిని
బ్రేక్ చేస్తూ  తన సొగసుల మెరుపుతో మైమరిపించేసింది. 










No comments:

Post a Comment