Saturday, June 9, 2018

దిల్ రాజుకు చుక్కలు చూపించిన అనుపమా పరమేశ్వరన్ || Dill Raju Production |...

సింగిల్ డోర్ డబుల్ డోర్ అంటూ తారలు ఇబ్బంది పెడుతుంటారు. నిర్మాతలకు అది పెద్ద తలపోటు. అందుకే చాలా వరకు స్టార్ హీరో హీరోయిన్స్ వారి సొంతంగా కార్ వ్యాన్ లను మెయింటైన్ చేస్తుంటారు. ఇకపోతే రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ - దిల్ రాజు ప్రొడక్షన్ టీమ్ కు మధ్య అదే అదే తరహాలో ఇష్యూ వచ్చిందట. వెంటనే తనకు సొంతంగా ఒక  కార్ వ్యాన్  అండ్ కాస్ట్యూమర్ ని సెట్ చేసుకుంటా అని చెప్పేసిందట. 

దిల్ రాజు ప్రొడక్షన్ లో రామ్ హీరోగా త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల షూటింగ్ లో అమ్మడికి సెట్ చేసిన  కార్ వ్యాన్ ఏ మాత్రం నచ్చలేదట దీంతో వెంటనే సిబ్బందిపై అరిచేసిందట. కాస్ట్యూమర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక చివరికి దిల్ రాజు కలుగజేసుకొని అమ్మడి ఆగ్రాహాన్ని తగ్గించినట్లు టాక్.  ఇంకా ఒక పెద్ద స్టార్ అవ్వకమునుపే ఇన్నేసి డిమాండ్స్ చేస్తుందా అని మనకు అనిపించకమానదు. 

రాజకీయాలు పవన్ వాళ్ళ కావు - కోటా చతుర్లు || Pawan Kalyan || Kota sriniva...



పవన్ రాజకీయంపై  ప్రముఖ సినీ నటుడు.. గతంలో రాజకీయాల్లో కాలెట్టి వెనక్కి వచ్చేసిన కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత రాజకీయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సినిమా వాళ్లకు రాజకీయ వాతావరణం పడదన్న ఆయన.. తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ పాలిటిక్స్ పై మొహమాటం లేకుండా మాట్లాడారు.

మనకెందుకు చెప్పండి.. నేనే వెనక్కి వచ్చేశాను.. ఊరికే పిచ్చోడినై వచ్చానా? అంటూ తన అనుభవాన్ని చెప్పిన ఆయన.. పవన్ రాజకీయంపై పెదవి విరిచేశారు. రజనీ లాంటి పెద్ద స్టారే.. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పడు.. వెళ్తానని చెప్పడని.. పెద్దోళ్లే అలా ఆలోచిస్తున్నప్పుడు కుర్రాడు ఆయన అర్థం చేసుకోవాలిగా అన్నారు.

పవన్ అన్న చిరుకు జరిగిన దాన్ని అర్థం చేసుకోవాలిగా అన్న కోట.. సినిమా వాళ్లకు రాజకీయ వాతావరణం పడదన్నాడు. సినిమాల్ని వదిలేసి.. రాజకీయాలపై సీరియస్ గా దృష్టి సారించిన వేళ.. కోట లాంటి సీనియర్ నటుడు పవన్ రాజకీయాల్ని సింపుల్ గా తేల్చేయటం ఆసక్తికరంగా మారాయి.