Saturday, June 9, 2018

రాజకీయాలు పవన్ వాళ్ళ కావు - కోటా చతుర్లు || Pawan Kalyan || Kota sriniva...



పవన్ రాజకీయంపై  ప్రముఖ సినీ నటుడు.. గతంలో రాజకీయాల్లో కాలెట్టి వెనక్కి వచ్చేసిన కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత రాజకీయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సినిమా వాళ్లకు రాజకీయ వాతావరణం పడదన్న ఆయన.. తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ పాలిటిక్స్ పై మొహమాటం లేకుండా మాట్లాడారు.

మనకెందుకు చెప్పండి.. నేనే వెనక్కి వచ్చేశాను.. ఊరికే పిచ్చోడినై వచ్చానా? అంటూ తన అనుభవాన్ని చెప్పిన ఆయన.. పవన్ రాజకీయంపై పెదవి విరిచేశారు. రజనీ లాంటి పెద్ద స్టారే.. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పడు.. వెళ్తానని చెప్పడని.. పెద్దోళ్లే అలా ఆలోచిస్తున్నప్పుడు కుర్రాడు ఆయన అర్థం చేసుకోవాలిగా అన్నారు.

పవన్ అన్న చిరుకు జరిగిన దాన్ని అర్థం చేసుకోవాలిగా అన్న కోట.. సినిమా వాళ్లకు రాజకీయ వాతావరణం పడదన్నాడు. సినిమాల్ని వదిలేసి.. రాజకీయాలపై సీరియస్ గా దృష్టి సారించిన వేళ.. కోట లాంటి సీనియర్ నటుడు పవన్ రాజకీయాల్ని సింపుల్ గా తేల్చేయటం ఆసక్తికరంగా మారాయి.  

No comments:

Post a Comment