Tuesday, May 22, 2018

అల్లరి చేసిందని కూతుర్నే చంపిన తల్లి || Mother killed her Daughter || Ta...

క్షణికావేశంలో ఏడాదిన్నర వయసున్న కూతురిని చంపిన తల్లి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారకమైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కొండసముద్రం గ్రామానికి చెందిన పరుచూరి భవ్యశ్రీ(23), తన ఏడాదిన్నర కూతురు మహిషిత మృతి చెందారు. భవ్యశ్రీ తన కూతురు మహిషిత అల్లరి చేసిందని కొట్టింది. కణతపై దెబ్బతగలడంతో మహిషిత మృతి చెందింది. పనికి వెళ్ళిన అత్తా మామలు, కుటుంబ సభ్యులు వస్తే తనను కూడా చంపేస్తారని భయపడింది. కూతురు లేని జీవితం తనకు అవసరం లేదని భావించింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి లోపల గడియపెట్టి చీరతో ఉరేసుకుంది. పొలం పనులకు వెళ్ళిన అత్తా మామలు ఇంటికి వచ్చేసరికి భవ్యశ్రీ ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది.



No comments:

Post a Comment