Wednesday, May 30, 2018

Who is the next CM of Andhrapradesh || Prestigious Survey Results Out ||...

ఆ సర్వే నివేదిక చంద్రబాబుకి అందిందని తెలుస్తుంది. ఆ నివేదిక లో ముందుగా తెలుగు దేశం బలాల్లోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు బాగుందని.. ఆయనవల్లే రాష్ట్రం ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారట.చంద్రబాబు బాగా కష్టపడుతున్నారని,పెన్షన్‌,రేషన్‌ నెలనెలా అందుతోందని,గ్రామాలలో రోడ్లు వేస్తున్నారని, విద్యుత్‌ సరఫరా బాగుందని పలువురు సర్వే సంస్థకు వివరించారు. కేంద్రం అన్యాయం చేసిందని చాలా మంది ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. సకాలంలోనే పోలవరం పూర్తవుతుందనే విశ్వాసం ప్రకటించారు. ఇక బలహీనతల విషయానికి వస్తే  రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోవడం పట్ల జనం అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది,అయితే అది కేంద్రం సాయం లేకపోవటం వల్ల  అని కొందరు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేల అవినీతి, పనితీరు పై చాలామంది పెదవి విరిచారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలలో పనులు చకచకా జరిగేవని, ప్రస్తుతం కొన్ని కార్యాలయాల్లో  పనులు జరగకపోగా, అవినీతి పెరిగిపోయిందని నిరసన వ్యక్తం చేశారు. కొన్ని ప్రధాన నగరాలలో ప్రజా ప్రతినిధుల పనితీరుపై సర్వేలో అసంతృప్తి వ్యక్తమయ్యింది.దీనితో చంద్రబాబు అప్రమత్తం అయ్యారు అని తెలుస్తుంది, ఇక ఉపేక్షిస్తే పార్టీ కి నష్టం అని ఇంకొక రెండు నెలల్లో పనితీరు మార్చుకోకపోతే సాగనంపటమే అని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బాగా అవినీతిపరులైన ఎమ్మెల్యేలు మొత్తంగా ఒక ఐదు,ఆరుగురు ఉన్నారని వారికి ఉద్వాసన తప్పదని తెలుస్తుంది.అంతే కాక వైకాపా కి సైతం ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి.



No comments:

Post a Comment